God Father Movie | ఓటీటీలోకి వచ్చేసిన గాడ్‌ఫాదర్.. స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఏదంటే?
God Father Movie On OTT | మెగాస్టార్ ప్రస్తుతం మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీ ఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్న చిరు.. అదే జోష్‌ను తర్వాతి సినిమాల్లో చూపించలేకపోతున్నాడు. 'ఖైదీ నెంబర్ 150' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, 'సైరా', 'ఆచార్య' చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో చిరు తీవ్రంగా నిరాశపడ్డాడు.
God Father Movie On OTT | మెగాస్టార్ ప్రస్తుతం మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీ ఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్న చిరు.. అదే జోష్‌ను తర్వాతి సినిమాల్లో చూపించలేకపోతున్నాడు. ‘ఖైదీ నెంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, ‘సైరా’, ‘ఆచార్య’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో చిరు తీవ్రంగా నిరాశపడ్డాడు. ఇక ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజైన ‘గాడ్‌ఫాదర్’ కూడా మెగాస్టార్‌కు నిరాశే మిగిల్చింది. రిలీజ్ రోజున ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఫైనల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్’కు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగు నెటీవిటీకు తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఇక్కడ రిలీజ్ చేశారు. ఫస్ట్ వీకెండ్ పర్వాలేదనింపంచిన సెకండ్ వీక్ నుండి ఫుల్ డ్రాప్స్ పడ్డాయి.
ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రం గత రాత్రి నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ ప్రియులనైనా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన ఈ చిత్రంలో నయనతార కీలకపాత్ర పోషించింది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్‌రోల్‌లో మెరిసాడు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఒరిజనల్ వెర్షన్ లూసిఫర్ అమెజాన్ ప్రైమ్‌లో మలయాళంతో పాటు తెలుగు వెర్షన్లోనూ అందుబాటులో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

