Ghosty Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ ఘోస్టీ మూవీ
Ghosty Movie On OTT | పదహారేళ్ల క్రితం వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. తొలి సినిమానే కాజల్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
Ghosty Movie On OTT | పదహారేళ్ల క్రితం వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. తొలి సినిమానే కాజల్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే 2009లో వచ్చిన ‘మగధీర’ కాజల్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యూత్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత వరుసగా డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా ప్రతి సినిమాకు క్రేజ్ పెరుగుతూ వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ కాజల్ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతుంది.
ఇక ఇటీవలే కాజల్ నటించిన ‘ఘోస్టీ’ విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ‘కోస్టి’గా ఉగాది సందర్భంగా రిలీజైంది. అయితే ఇక్కడ కూడా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ ద్విపాత్రాభినయం చేసింది. కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కే.ఎస్ రవికుమార్, యోగిబాబు, రాధిక శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు.
దాస్ అనే గ్యాంగ్‌స్టర్‌ను షూట్ చేయబోతున్న ఇన్స్పెక్టర్ హారతి పొరపాటున మరొకరిని చంపేస్తుంది. ఇంతకీ హారతి చంపింది ఎవరు? హారతి చేసిన పని వల్ల పోలీస్ స్టేషన్లో ఆత్మలు ఎలా వచ్చాయన్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే హార్రర్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రం ఈ సినిమా నచ్చుతుందని పలువురు ఆడియెన్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

