కన్నడ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఘోస్ట్’. ఈ చిత్రాన్ని సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో శివరాజ్ కుమార్ రెట్రో లుక్ వైవిధ్యంగా ఉంది.
ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మైసూర్లో పూర్తయింది. వచ్చే నెలలో బెంగళూరులో వేసిన భారీ సెట్లో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. డాక్టర్ శివరాజ్ కుమార్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్రబృందం చెబుతున్నారు. జయరామ్, ప్రశాంత్ నారాయణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మహేంద్ర సింహ, సంగీతం : అర్జున్ జన్య.