Ghani OTT | ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గని’!
Ghani movie On aha | అప్పట్లో సినిమాలు థియేటర్లలో వంద నుంచి నూటయాభై రోజులకు పైగా ఆడేవి. ఇక ఆ సినిమా టీవీలో రావాలంటే కనీసం ఆర్నెళ్ళైనా పట్టేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా 4 నుంచి 5 వారాల్లోపే డిజిటల్లోకి వస్తుంది. అదే సినిమా ఫ్లాప్ అయితే రెండు నుంచి మూడు వారాల్లోపే ఓటీటీలలో దర్శనం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘పుష్ప’ నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. ఇక ఇటీవలే విడుదలై ఫ్లాప్‌గా నిలిచిన ‘రాధేశ్యామ్’ రెండు వారాల్లోనే డిజిటల్లో సందడి చేసింది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ‘గని’ కూడా గత రాత్రి 12గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి తెరకెక్కించాడు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. పోటీగా ‘ఆర్ఆర్ఆర్’ ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్లకు ఖర్చు చేసిన బడ్జెట్‌ను కూడా రికవరీ చేయలేకపోయింది. వరుణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది. ఎస్ఎస్ థమన్ సంగీతం కూడా ఈ చిత్రాన్ని ఏమాత్రం కాపాడలేకపోయింది. అల్లుఅరవింద్ సమర్పణలో అల్లుబాబీ, సిద్ధూముద్ద కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు. వరుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

