Dai Dai | అప్పట్లో ‘వాకా వాకా’.. ఇప్పుడు ‘డాయ్ డాయ్’.. సరికొత్త ఫిఫా వరల్డ్ కప్ యాంథమ్‌తో దుమ్మురేపుతున్న షకిరా!
Shakira | ఫుట్‌బాల్ ప్రేమికులకు, పాప్ మ్యూజిక్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. 2010 ఫిఫా వరల్డ్ కప్‌లో "వాకా వాకా" పాటతో ప్రపంచాన్ని ఊపేసిన కొలంబియన్ పాప్ స్టార్ షకిరా, ఇప్పుడు మరోసారి ఫుట్‌బాల్ మైదానాన్ని షేక్ చేయడానికి సరికొత్త యాంథమ్‌తో సిద్ధమైంది.
Fifa 2026 | ఫుట్‌బాల్ ప్రేమికులకు, పాప్ మ్యూజిక్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. 2010 ఫిఫా వరల్డ్ కప్‌లో “వాకా వాకా” పాటతో ప్రపంచాన్ని ఊపేసిన కొలంబియన్ పాప్ స్టార్ షకిరా, ఇప్పుడు మరోసారి ఫుట్‌బాల్ మైదానాన్ని షేక్ చేయడానికి సరికొత్త యాంథమ్‌తో సిద్ధమైంది. ప్రముఖ ఆఫ్రోబీట్స్ ఐకాన్ బర్నా బాయ్‌తో కలిసి ఆమె పాడిన ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారిక ఆల్బమ్ సాంగ్ “డాయ్ డాయ్” మ్యూజిక్ వీడియో తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
హన్నా లక్స్ డేవిస్ దర్శకత్వంలో మియామీలో అద్భుతంగా చిత్రీకరించిన ఈ హై-వోల్టేజ్ మ్యూజిక్ వీడియోలో ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, కిలియన్ ఎంబాప్పే, ఎర్లింగ్ హాలాండ్ వంటి వారు కనిపిస్తూ “మేము సిద్ధం” అంటూ ఎనర్జిటిక్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియోలో డియెగో మారడోనా, క్రిస్టియానో రొనాల్డో, డేవిడ్ బెక్హాం, కాకా వంటి లెజెండ్స్‌కు సంబంధించిన పాత క్లిప్స్‌ను చూపిస్తూ షకిరా వారికి ప్రత్యేక నివాళి అర్పించింది. ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాల జెండాల థీమ్ దుస్తులలో డ్యాన్సర్లతో కలిసి షకిరా వేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ పాట కేవలం వినోదం కోసమే కాకుండా, ఫిఫా గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్ మద్దతుగా ఒక గొప్ప సామాజిక లక్ష్యంతో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లల విద్య, ఫుట్‌బాల్ అవకాశాల కోసం ఈ పాట ద్వారా తనకు వచ్చే రాయల్టీలను షకిరా విరాళంగా ఇస్తోంది. మరో విశేషమేమిటంటే, ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే మొదటిసారిగా జూలై 19, 2026న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో భారీ హాఫ్‌టైమ్ షోను నిర్వహించబోతున్నారు. ఈ చారిత్రాత్మక వేదికపై షకిరా, పాప్ క్వీన్ మెడోనా మరియు ప్రముఖ కొరియన్ బ్యాండ్ బీటీఎస్లతో కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడాల్లో జరగనున్న ఈ ప్రపంచకప్ వేడుకలకు ముందే, “డాయ్ డాయ్” పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

