Naga durga | ఫోక్ సింగర్ నాగదుర్గకు బంపర్ ఆఫర్.. ఆ టాప్ బ్యానర్లో హీరోయిన్గా లక్కీ ఛాన్స్!
Folk Singer Nagadurga | 'కాపోళ్ల ఇంటికాడా', 'పేరుగల్ల పెద్దిరెడ్డి', 'దారి పొంటొతుండు' వంటి విలక్షణమైన జానపద గీతాలతో, తన అద్భుతమైన నృత్యంతో యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకున్న ప్రముఖ ఫోక్ సింగర్, డాన్సర్ నాగదుర్గ టాలీవుడ్లో బంపర్ ఆఫర్ కొట్టేసింది.
Folk Singer Nagadurga | ‘కాపోళ్ల ఇంటికాడా’, ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’, ‘దారి పొంటొతుండు’ వంటి విలక్షణమైన జానపద గీతాలతో, తన అద్భుతమైన నృత్యంతో యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకున్న ప్రముఖ ఫోక్ సింగర్, డాన్సర్ నాగదుర్గ టాలీవుడ్లో బంపర్ ఆఫర్ కొట్టేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై తన మార్కు జానపద నృత్యాలతో సెన్సేషన్ సృష్టించిన ఈ తెలంగాణ జానపద కళాకారిణి, ఇప్పుడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి చెందిన ‘సుకుమార్ రైటింగ్స్’ (Sukumar Writings) మరియు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కి చెందిన ‘బన్నీ వాస్ ప్రొడక్షన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్న ఒక క్రేజీ ప్రాజెక్టులో నాగదుర్గకు హీరోయిన్గా లక్కీ ఛాన్స్ దక్కింది.
ఈ సినిమాలో హీరోగా వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి నటించబోతున్నాడు. ఈ సినిమాతో వంశీ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ‘కలివి వనం’ అనే ఓ విలక్షణమైన చిత్రంలో నటించిన నాగదుర్గ, ఆ తర్వాత తమిళంలోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించింది. ఇప్పుడు టాలీవుడ్ లోని మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ల నిర్మాణంలో, ప్రియదర్శి సరసన లీడ్ రోల్ పొంది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నాగదుర్గ పల్లెటూరి నైపథ్యం, ఆమె సహజ సిద్ధమైన నటన, హావభావాలు ఈ చిత్రానికి ప్రధాన బలం కానున్నాయని తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, టైటిల్ మరియు పూర్తి నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

