Thalapathy Vijay | కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు.. విజయ్ విక్టరీపై ఆర్జీవీ సంచలన పోస్ట్!
Thalapathy Vijay | టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎప్పుడూ సంచలనంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.
Thalapathy Vijay | టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎప్పుడూ సంచలనంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ రాజకీయాలను ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ 107 స్థానాలను గెలుచుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశించి వర్మ ఒక అరుదైన పాత ఫోటోను పంచుకున్నారు. ఆర్జీవీ షేర్ చేసిన ఫోటోలో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ రాజకీయ దిగ్గజం కళైంజ్ఞర్ కరుణానిధి ఒక కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేస్తూ కనిపిస్తారు. విశేషమేమిటంటే, ఆ సమయంలో ఆయన వెనుకే సుమారు 16 ఏళ్ల వయసున్న కుర్రాడిగా దళపతి విజయ్ నిలబడి ఉన్నారు.
అయితే ఈ ఫోటోను ఉద్దేశించి వర్మ స్పందిస్తూ.. తన వెనుక నిలబడిన ఈ చిన్నారి (విజయ్), ఒకరోజు తన పార్టీని (DMK) నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు. ఈరోజు అదే వ్యక్తి ఆ పార్టీకి సవాల్ విసిరి, ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు అని వర్మ పేర్కొన్నారు. దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ గట్టి దెబ్బ కొట్టారు. కరుణానిధి నీడలో ఒక సామాన్య యువకుడిగా కనిపించిన విజయ్, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన రాజకీయ కోటను బద్దలు కొట్టడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాలం ఎంతటి బలమైనదో చెప్పడానికి ఈ ఫోటో ఒక నిదర్శనమని ఆర్జీవీ తన పోస్ట్ ద్వారా చెప్పుకోచ్చాడు.
Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S
— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

