Sreeleela | శ్రీలీల.. అభిమానులు వెయిటింగ్ ఇక్కడ..!
Sreeleela | తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది శ్రీలీల (Sreeleela). అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా కేటగిరీ ఏదైనా సరే తనదైన మార్క్‌ను చూపించడం ఈ బ్యూటీ స్టైల్.
Sreeleela | తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది శ్రీలీల (Sreeleela). అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా కేటగిరీ ఏదైనా సరే తనదైన మార్క్‌ను చూపించడం ఈ బ్యూటీ స్టైల్. ఇటీవలే భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి భారీ సినిమాలతో ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. గుంటూరు కారంలో మహేశ్ బాబుతో శ్రీలీల అదిరిపోయే కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
2023లో వరుస సినిమాలతో అభిమానులను ఊపిరాడకుండా చేసిన శ్రీలీల 2024లో మాత్రం స్పీడు తగ్గించిందనే చెప్పాలి. ఎందుకంటే శ్రీలీల నుంచి కొత్త సినిమాల ప్రకటన ఏమీ రావడం లేదు. ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ఏమీ ప్రకటించలేదు. పరీక్షలకు హాజరై తన చదువును పూర్తి చేసే పనిలో భాగంగానే శ్రీలీల సినిమాల నుంచి విరామం తీసుకుందని ఫిలింనగర్ సర్కిల్లో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఫేవరేట్ హీరోయిన్ ఇంకెప్పుడు కొత్త మూవీ ప్రకటిస్తుందంటూ తెగ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
శ్రీలీల ఇక వరుస ఆఫర్లు తలుపు తడుతున్నా.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అప్పుడే కొత్త సినిమాలకు సైన్ చేసే విషయంలో తొందరపడకూడదని నిర్ణయించుకుందని టాక్ నడుస్తోంది. శ్రీలీల పవన్ కల్యాణ్‌తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh) సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతానికి ఈ భామ ఖాతాలో ఉన్న ఒకే ఒక సినిమా ఇది. మరి శ్రీలీల నుంచి నయా ప్రాజెక్టుల అప్డేట్స్ రావాలంటే ఇంకెంత కాలం పడుతుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

