Samantha | ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ మూవీ ట్రైలర్ వేడుకలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో, సమంత భర్త, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్-ఫ్యామిలీ డ్రామా జూన్ 19 న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజ్ నిడిమోరు స్టేజీపై మాట్లాడుతుండగా ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని ఒక్కసారిగా పైకి వచ్చాడు. అతడు నేరుగా సమంత ముందుకు వెళ్లి, మోకాళ్లపై కూర్చొని ఒక బొకే ఇచ్చి తన అభిమానాన్ని చాటుకుంటూ ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత అతడు సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించగా అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడిని పక్కకు లాగేయబోయారు. అయితే సమంత ఎంతో సున్నితత్వంతో వారిని వారించి, చాలా కూల్‌గా నవ్వుతూ ఆ అభిమానితో సెల్ఫీ ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. భార్యకు అందరి ముందే ఒక అభిమాని ప్రపోజ్ చేస్తుంటే పక్కనే ఉన్న భర్త రాజ్ నిడిమోరు ఏమాత్రం కంగారు పడకుండా చాలా సరదాగా నవ్వుతూ ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.