తిరువీర్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. ఎస్పీ దుర్గ నరేష్ దర్శకుడు. రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మాతలు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. తిరువీర్ మాట్లాడుతూ ‘కుటుంబసమేతంగా కలిసి చూసే మంచి క్లీన్ ఎంటర్టైనర్ ఇది.
తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ ఇదని, ఈ సినిమా మీతో మాట్లాడటమేకాక, మీరు మాట్లాడేలా చేస్తుందని దర్శకుడు ఎస్పీ దుర్గనరేశ్ చెప్పారు. ఇంకా ఈటీవీ విన్ ప్రతినిధి సాయికృష్ణ, మైత్రీ శశిధర్‌రెడ్డి కూడా మాట్లాడారు.