Rowan Atkinson: మిస్టర్ బీన్ మరణించినట్టు తప్పుడు ప్రచారం.. సదరు ఛానెల్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్

మిస్టర్ బీన్.. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆయన అసలు పేరు రోవాన్ అట్కిన్సన్. ఆయన పోషించిన ‘మిస్టర్ బీన్’ పాత్ర మొదటిసారి 1990లో వెలుగులోకి వచ్చింది. దీని తరువాత క్రమంగా ఈ పాత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీంతో రోవాన్ అట్కిన్సన్ ను అందరూ మిస్టర్ బీన్ అని పిలవడం విశేషం.
బ్రిటిష్ నటుడు రోవాన్ అట్కిన్సన్ ఇక లేరంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మిస్టర్ బీన్’గా ప్రపంచానికి బాగా దగ్గరైన రోవాన్ చనిపోయాడంటూ ఓ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ప్రసారం చేయగా, ఈ వార్త చూసిన ఆయన అభిమానులు కలత చెందారు. రోవాన్ అట్కిన్సన్ చనిపోయాడని నిజంగానే భావించి కొంతమంది RIP మిస్టర్ బీన్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. కానీ ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తెలిసి మండిపడ్డారు.
ఫాక్స్ న్యూస్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ‘ఫాక్స్ బ్రేకింగ్ న్యూస్ – మిస్టర్ బీన్ (రోవాన్ అట్కిన్సన్) 58 సంవత్సరాల వయస్సులో కారు ప్రమాదంలో మరణించారు’ అంటూ లింక్‌పై క్లిక్ చేయండి అని పోస్ట్ చేశారు. తప్పుడు వార్తని ప్రచారం చేసినందుకు అంతర్జాతీయంగా ఉన్న రోవిన్ అభిమానులు సదరు న్యూస్ ఛానల్ పై మండి పడుతున్నారు. అయితే రోవాన్ అట్కిన్సన్ మరణించినట్లు వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. రోవాన్ అట్కిన్సన్ అకా మిస్టర్ బీన్ 18 మార్చి 2017 న రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఇంతకు ముందు కూడా వార్తలు రాగా ఆయన బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రోవిన్ అట్కిన్సన్ ప్రముఖ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’లో హిట్లర్ పాత్రను పోషించబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

