Kartavya | బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘కర్తవ్య’. ఈ చిత్రం నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేయబోతుండగా తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా తన నటనతో కట్టిపడేశారు. తన వృత్తిలో నిజాయతీగా ఉంటే స్వయంగా తన కుటుంబ సభ్యుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని తెలిసినప్పటికీ, ఒక అధికారిగా తన కర్తవ్యాన్ని ఆయన ఎలా నిర్వహించారు అనే ఉత్కంఠభరిత అంశాలతో ఈ సినిమా సాగనుంది.
విలక్షణ దర్శకుడు పులకిత్ తెరకెక్కించిన ఈ చిత్రం మే 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించడం విశేషం.