Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. ఈ టాలెంటెడ్ హీరో నుంచి వస్తు్న్న తాజా ప్రాజెక్ట్ హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కి డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. నాని టీం షూటింగ్‌తో బిజీగాఉంది. ఇంతకీ న్యాచురల్ టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..? తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో కొత్త షెడ్యూల్ మొదలైంది. నేడు ఊటీలో నయా షెడ్యూల్ షురూ అయింది. ఓ అందమైన ప్రదేశంలో తీసిన స్టిల్‌ను షేర్ చేస్తూ.. ఈ అప్డేట్ అందించాడు నాని. ఇప్పుడీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. మేకర్స్ త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రంలో మృణాళ్ ఠాకూర్ యశ్న పాత్రలో నటిస్తోండగా.. నాని కూతురు పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. మృణాళ్ ఠాకూర్‌ను తన స్నేహితురాలికి పరిచయం చేస్తూ బేబి కైరా చెప్తున్న డైలాగ్స్‌తో షురూ అయిన టైటిల్ గ్లింప్స్.. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో హర్ట్ టచింగ్ ట్యూన్‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మృణాళ్ ఠాకూర్, నాని, బేబి కైరా మధ్య సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
హాయ్ నాన్న చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్ కాగా.. జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాడు. హాయ్ నాన్న సినిమాకు సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్ కాగా.. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల తర్వాత కెమెరామెన్ సను జాన్ వర్గీస్ ఐఎస్సీ మరోసారి నానితో చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం.
Nani’s #HiNanna new schedule begins in Ooty.
Nani, Mrunal Thakur, Shruthi Haasan. pic.twitter.com/zJHmNc6q6x
— Christopher Kanagaraj (@Chrissuccess) September 2, 2023
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..