ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన దిలీప్ కుమార్..!

పాకిస్తాన్‌లోని పెషావర్‌లో 1922లో జన్మించిన నటుడు దిలీప్ కుమార్. ఈయన అసలు పేరు యూసుఫ్ ఖాన్. పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు వచ్చి మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన దిలీప్ కుమార్ శుక్రవారం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ముంబైలోని హిందూజా ఆసుపత్రికి వెళ్లారు. దిలీప్ ఆసుపత్రికి వెళ్లాడనే సరికి అభిమానులు ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన దిలీప్ సతీమణి .. అభిమానులు ఎవరు ఆందోళన చెందొద్దని అన్నారు.
దిలీప్ కుమార్ శరీరంలో కొన్ని అవయవాలు సరిగా పని చేయని కారణంగా వైద్యులు పరీక్షల కోసం అడ్మిట్ చేయమని సూచించారు. ఆసుపత్రిలో రెండు రోజులు ఉంచి అన్ని పరీక్షలు చేసిన తర్వాత, అతని ఆరోగ్యం బాగుందని, ఇంటికి వెళ్లొచ్చని చెప్పారు. మీ అందరి ప్రార్ధనలతో దిలీప్ క్షేమంగా ఉన్నారని సైరా భాను పేర్కొంది. 97 ఏళ్ల దిలీప్ కుమార్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న విషయం తెలిసిందే. కాగా, దిలీప్ కుమర్ ఈ నెలలో కోవిడ్ -19 సంక్షోభం వలన అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ చివరిసారిగా 1998 లో ‘ఖిలా’లో కనిపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

