NTR Neel | బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘ధురంధర్’ చిత్రంలో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడర్ శ్రీరాని బలోచ్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బిమల్ ఒబెరాయ్‌కు టాలీవుడ్లో బంపర్ ఆఫర్ లభించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) లో ఆయన ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ మార్క్ పవర్ఫుల్ యాక్షన్ చిత్రంలో తనకు ప్రాముఖ్యత ఉన్న రోల్ దక్కినట్లు నటుడు బిమల్ ఒబెరాయ్ స్వయంగా వెల్లడించారు. తాను ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నట్లు ఆయన ధృవీకరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్లో ‘ధురంధర్’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఈ నటుడు తెలుగులో ఎంట్రీ ఇస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో అంచనాలు మరింత పెరిగాయి.