Dhurandhar 2 | రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ (Dhurandhar 2: The Revenge) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుని భారతీయ సినిమా చరిత్రలో కళ్లు చెదిరే రికార్డులను నెలకొల్పింది. మార్చి 19న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్, ఏడు వారాలు గడిచినా ఇంకా థియేటర్లలో బలంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమా ఇప్పటివరకు రూ.1791 కోట్ల వసూళ్లను సాధించడంతో పాటు పలు రికార్డులను నమోదు చేసింది. అయితే ఆ రికార్డులు ఏంటి అనేది చూసుకుంటే.
బాహుబలి 2 రికార్డ్ బ్రేక్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ‘బాహుబలి 2స (రూ.1,788 కోట్లు) రికార్డును అధిగమించి, ‘దంగల్’ తర్వాత రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
రూ. 1000 కోట్ల క్లబ్: భారతదేశంలో రూ.1,000 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిన తొలి హిందీ సినిమాగా ధురంధర్ 2 చరిత్ర సృష్టించింది. అలాగే కేవలం 6 రోజుల్లోనే రూ.500 కోట్లు, మొదటి వారంలోనే రూ.1,000 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌ను అందుకున్న ఏకైక హిందీ చిత్రంగా రికార్డును నెలకొల్పింది. ఆదిత్య ధర్ అద్భుతమైన టేకింగ్, రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ యాక్షన్, మరియు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి.