IMDB మోస్ట్ పాపులర్ హీరోగా ధనుష్.. బాలీవుడ్లో ఒక్కరికే చోటు..!
తమిళ హీరో ధనుష్‌కు దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈయన కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'తిరు'తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ధనుష్.. ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు.
Dhanush | తమిళ హీరో ధనుష్‌కు దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈయన కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ‘తిరు’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ధనుష్.. ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. ఇదిలా ఉంటే ధనుష్ తాజాగా అరుదైన ఘనతను సాధించాడు. ఇంటర్నెట్ మూవీ డాటాబేస్(IMDB) సంస్థ ఈ యేడాది చిత్రసీమని ప్రభావితం చేసిన టాప్ 10 ఇండియన్ స్టార్స్ జాబితాని రిలీజ్ చేసింది. కాగా అందులో ధనుష్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇండియన్ స్టార్లతో పోటీ పడి ధనుష్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడంటే విశేషం అనేచెప్పాలి. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో వరుసగా అలీయాభట్, ఐశ్వర్య రాయ్ ఉన్నారు. కాగా టాలీవుడ్ నుండి రామ్‌చరణ్ 4వ స్థానంలో, ఎన్టీఆర్ 8వ స్థానంలో, అల్లు అర్జున్ 9వ స్థానంలో నిలిచాడు. ఇక 10వ స్థానంలో కోలీవుడ్ నటుడు యష్ ఉన్నాడు. టాప్-10లో సౌత్ నుండి నలుగురు హీరోలు ఉండటం విశేషం. అయితే ఈ టాప్-10 జాబితాలో బాలీవుడ్ నుండి ఒక్క హృతిక్ రోషన్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. హీరోయిన్లలో సమంత మాత్రమే సౌత్ నుండి చోటు దక్కించుకుంది. కాగా సమంత 5వ ప్లేస్‌ను కైవసం చేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

