Devara Movie | RRR చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ అభిమాని.. వీడియో పంచుకున్న తారక్
Devara Movie Japan Release | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం దేవర ప్రమోషన్స్‌లో బిజిగా ఉన్న విషయం తెలిసిందే.
Devara Movie Japan | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం దేవర ప్రమోషన్స్‌లో బిజిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జపాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన తారక్ అక్కడి మీడియాతో ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు. అయితే ప్రమోషన్స్ అనంతరం అభిమానులను కలుసుకున్న తారక్‌కి ఒక లేడి అభిమాని షాక్ ఇచ్చింది. ఆమె తారక్ వద్దకి వచ్చి..
తారక్ అన్న నేను ఆర్ఆర్ఆర్ సినిమా చూసి తెలుగు నేర్చుకున్నాను. నేను మీతో తెలుగులో మాట్లాడలని రెండు ఏండ్ల నుంచి ఈ తెలుగు బుక్‌ని పట్టుకుని తిరుగుతున్నాను. మీరు నా లైఫ్‌కి స్పూర్తి.. అని ఆమె చెప్పాగా.. తారక్ మాట్లాడుతూ.. మీరు మా అందరికీ పెద్ద స్ఫూర్తి అంటూ ఆ అభిమానికి ఆటోగ్రాఫ్‌ని ఇచ్చిన వీడియోను పంచుకున్నాడు.
నేను జపాన్ వెళ్లిన ప్రతిసారి నాకు అందమైన జ్ఞాపకాలను అందిస్తుంది. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఒక జపనీస్ అభిమాని నాతో “RRR” సినిమా చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పడం నన్ను నిజంగా కదిలించింది. సినిమా, భాషల పట్ల ప్రేమికుడిగా ఉన్న నాకు, ఒక సినిమా రెండు సంస్కృతుల మధ్య సేతువుగా పనిచేసి, ఒక అభిమానిని ఒక కొత్త భాష నేర్చుకునేలా ప్రేరేపించడం అనేది నేనెన్నటికీ మరచిపోలేని విషయం.
భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తూ ఇలాంటి అద్భుతాలను సృష్టిస్తుండటం మరోసారి దాన్ని జరుపుకోవడానికి కారణం అయింది. జపనీస్ అభిమాని నాతో తెలుగులో మాట్లాడినప్పుడు, ఆమె కళ్లలో “RRR” పట్ల ఉన్న ఆరాధన.. తెలుగు భాష పట్ల ఆమె చూపిన అంకితభావం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఒక సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, భాషలను, సంస్కృతులను కలపడానికి ఇంతటి శక్తిని కలిగి ఉంటుందని ఆ క్షణంలో నేను గ్రహించాను. ఇది నా జపాన్ పర్యటనలోనే అత్యంత ప్రత్యేకమైన అనుభవంగా మిగిలిపోయిందంటూ తారక్ రాసుకోచ్చాడు.
My visits to Japan always give me beautiful memories but this one hit differently. Hearing a Japanese fan tell me she learned Telugu after watching RRR truly moved me.
Being a lover of cinema and languages, the power of cinema to be a bridge across cultures and encouraging a… pic.twitter.com/4bQ1v8ZZP8
— Jr NTR (@tarak9999) March 27, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

