Devara Movie Japan | జపాన్‌కి వెళుతున్న ‘దేవర’.. ప్రమోషన్స్ షురూ చేసిన ఎన్టీఆర్
Devara Movie | ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర (Devara) జపాన్‌లో విడుదల కాబోతుంది.
Devara Movie Japan Release | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే చిత్ర జపాన్‌కి వెళుతుంది.
ఎన్టీఆర్ చిత్రాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ విడుదలైన బాద్షాతో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా జపాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు తారక్. ఇందులో భాగంగానే జపాన్ అభిమానులు, అక్కడి మీడియాతో వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గోన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను దేవర టీమ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. మరోవైపు దేవర ప్రమోషన్స్‌లో భాగంగా మార్చి 22న జపాన్‌కి వెళ్లనున్నాడు ఎన్టీఆర్.
Man of Masses @Tarak9999 has kick started #Devara promotions with interviews for Japanese media ahead of his visit on March 22nd 🌊
The countdown begins for the grand release in Japan on March 28th. pic.twitter.com/UwPJLNrQ1I
— Devara (@DevaraMovie) February 25, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

