‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ స్టార్. అందుకే దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్లో ‘దేవర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాతలు నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దిన పోరాటలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఇందులోని అండర్‌వాటర్ సీక్వెన్స్ కోసం జోడించిన వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అద్భుతమైన అనుభూతికి లోనుచేస్తాయని వారు అంటున్నారు.
ఇదిలావుంటే ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలని నిర్మాతలు భావించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇందులో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడటంతో షూటింగ్ కాస్త జాప్యం జరిగింది. దాంతో విడుదల తేదీని కూడా వాయిదా వేశారు. సైఫ్ విశ్రాంతిలో ఉండటంతో ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కొరటాల. సైఫ్ వస్తే మిగతా టాకీ కూడా పూర్తి చేస్తారు. అప్పుడుకానీ విడుదల తేదీపై క్లారిటీ రాదని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే మాంటేజస్ సాంగ్ చిత్రీకరణ పూర్తయింది. నాలుగు పాటల చిత్రీకరణ మిగిలివుంది. ఇందులో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.