ఆ ఆలస్యం నాకిష్టంలేదు
చేసే పనిగంటల విషయంలో ఎంత కచ్ఛితంగా ఉంటారో.. చేసే పని విషయంలో అంత నిబద్ధతగా, బాధ్యతగా ఉంటారు బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకోన్.
చేసే పనిగంటల విషయంలో ఎంత కచ్ఛితంగా ఉంటారో.. చేసే పని విషయంలో అంత నిబద్ధతగా, బాధ్యతగా ఉంటారు బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకోన్. పని గంటల విషయంలో ఆమె వివాదంలో చిక్కుకున్నప్పటికీ.. పని విషయంలో మాత్రం ఏనాడూ ఆమె విమర్శల పాలవ్వలేదు. షూటింగులకు లేట్‌గా వచ్చిన దాఖలాలు కూడా లేవు. అట్లీ, అల్లు అర్జున్‌ల ‘రాకా’ చిత్రంలోని తన భాగాన్ని పూర్తి చేసిన తర్వాతే ప్రసూతి విరామాన్ని తీసుకున్నారు దీపిక.
గత నెల 19న ఆమె ఓ ఆడబిడ్డకు జన్మినిచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తిరిగి షూటింగుల్లో పాల్గొనేందుకు ఏ నటి అయినా ఓ ఆరు నెలలు విరామం తీసుకుంటుంది. కానీ దీపిక.. బిడ్డకు జన్మనిచ్చిన కేవలం 37 రోజుల్లోనే తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నారు. సోమవారం(నేడు) నుంచే ఆమె షారుక్‌ఖాన్ ‘కింగ్’ సెట్స్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. షారుక్, దీపికాలపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ ‘మళ్లీ పనిలో బిజీ కావడం ఆనందంగా ఉంది.
‘అప్పుడే షూటింగా?’అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. వారికి నేనిచ్చే సింపుల్ సమాధానం ఒక్కటే.. ‘తప్పదు’. ఎందుకంటే.. డిసెంబర్ 24న ‘కింగ్’ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. నా వల్ల వారి సినిమా లేట్ కావడం నాకిష్టం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు దీపిక పదుకోన్. వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనం అంటూ పలువురు అభినందనలు అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

