24 క్రాఫ్ట్ పతాకంపై సీవీ రెడ్డి నిర్మాణ సారధ్యంలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో విక్రాంత్‌రెడ్డి, చతుర్వేది, ఆహారిక, సురేశ్, ప్రియాంక ముఖ్య పాత్రలతో తీసిన ‘డాటర్ ఆఫ్ కట్టప్ప’ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సాయిరామ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవారని, కిడ్నాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని తెలిపారు.
ఆద్యంతం ఆసక్తి కలిగించే కథ, కథనాలతో రూపొందిందన్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం డేవిడ్.జి, ఎడిటింగ్ బాబ్జి, డీఐ జాని భాష