Dasara Movie | మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి దసరా.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Dasara Movie On OTT | దసరా రిలీజై నెల రోజులు దగ్గరికొస్తున్నా ఇంకా బీ, సీ సెంటర్లలో ఈ సినిమా సందడే కనిపిస్తుంది. థియేటర్లలో టిక్కెట్లు భారీ సంఖ్యలో తెగుతూనే ఉన్నాయి. ఇక ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న నానికి దసరా అలాంటి విజయాన్నే అందించింది.
Dasara Movie On OTT | దసరా రిలీజై నెల రోజులు దగ్గరికొస్తున్నా ఇంకా బీ, సీ సెంటర్లలో ఈ సినిమా సందడే కనిపిస్తుంది. థియేటర్లలో టిక్కెట్లు భారీ సంఖ్యలో తెగుతూనే ఉన్నాయి. ఇక ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న నానికి దసరా అలాంటి విజయాన్నే అందించింది. ఇక ఇన్నాళ్లు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న నానికి ఇప్పుడు మాస్ ఆడియెన్స్ నుంచి కూడా యాక్సెప్టె్న్స్ దొరికింది. ఈ సినిమా నానిని వంద కోట్ల క్లబ్లో నిల్చోబెట్టింది. ఇక దర్శకుడు శ్రీకాంత్ టేకింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి సినిమాకే ఈ రేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడంటే మాములు విషయం కాదు.
ఇక ఎప్పుడెప్పుడా అని ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న దసరా మూవీ మరి కొన్ని గంటల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. అయితే ఇప్పటికీ మంచి రన్ కొనసాగిస్తున్న ఈ సినిమాను అప్పుడే ఓటీటీలోకి తీసుకురావడం గమనార్హం. అయితే ముందుగా డీల్ కుదిరించుకున్న ప్రకారమే ఈ సినిమాను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన దసరా ఇప్పటివరకు రూ.120 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్లో 2మిలియన్ డాలర్ మార్క్‌ను ఎప్పుడో దాటేసింది. ఈ సినిమాలో నాని ధరణి పాత్ర పోషించగా.. కీర్తి వెన్నెలగా నటిచింది. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి సూరి పాత్రలో మెరిసాడు. సముద్రఖని, సాయికుమార్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో షైన్ టామ్‌చాకో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. విలేజ్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

