Darling | రీ-రిలీజ్లో దుమ్మురేపుతున్న ‘డార్లింగ్’ … రెండు రోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా గ్రాస్!
Darling | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్ ప్రారంభ దశలో చేసిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్లలో ప్రత్యేక స్థానం సంపాదించిన చిత్రం డార్లింగ్. దర్శకుడు ఎ. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ గ్రాండ్ రీ-రిలీజ్‌తో థియేటర్లలోకి వచ్చి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Darling | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్ ప్రారంభ దశలో చేసిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్లలో ప్రత్యేక స్థానం సంపాదించిన చిత్రం డార్లింగ్. దర్శకుడు ఎ. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ గ్రాండ్ రీ-రిలీజ్‌తో థియేటర్లలోకి వచ్చి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ రీ-రిలీజ్ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి భారీగా రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా దూసుకెళ్తున్నాయి. మొదటి రోజే ఈ చిత్రం రూ.7 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఈ క్రమంలో కేవలం రెండు రోజుల్లోనే మొత్తం రూ.9.36 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా రాబట్టినట్లు సమాచారం. ఈ రికార్డు కలెక్షన్లతో ‘డార్లింగ్’ రీ-రిలీజ్ సినిమాల్లోనే కాకుండా రీజనల్ భాషల చిత్రాల్లో కూడా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత పెరిగిందో ఈ రీ-రిలీజ్ కలెక్షన్లు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇక సినిమాలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా, సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందించారు. చంద్రమోహన్, ప్రభు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రం ఇప్పటికీ అదే ఫ్రెష్ ఫీల్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది.
‘డార్లింగ్’ రీ-రిలీజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ, ప్రభాస్ స్టార్డమ్కు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ జోరు కొనసాగితే రీ-రిలీజ్ రికార్డులను తిరగరాయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే
త్వరలో ఫౌజీ చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఈ మూవీ హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనుండగా, ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయంగా తెలుస్తుంది.మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ కూడా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

