Daggubati Abhiram | దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. టాలీవుడ్ స్టార్ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడయ్యారు. డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. తన కుటుంబానికి అత్యంత దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ బుధవారం పెళ్లిచేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఇక మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇటీవలే ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక శ్రీలంక నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.