Ahimsa | దగ్గుబాటి వారసుడి సినిమాకు మోక్షం.. ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి!
Ahimsa | ఈ రోజుల్లో ఒక సినిమా విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరీ బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే 45 రోజుల దాకా టైమ్ తీసుకుంటుంది. లేదంటే నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుంది. కానీ ఒక సినిమా మాత్రం థియేటర్లో రిలీజైన ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
Ahimsa | ఈ రోజుల్లో ఒక సినిమా విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరీ బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే 45 రోజుల దాకా టైమ్ తీసుకుంటుంది. లేదంటే నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుంది. కానీ ఒక సినిమా మాత్రం థియేటర్లో రిలీజైన ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అదే దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా అరంగేట్రం చేసిన అహింస. ఎట్టకేలకు ఈ సినిమాకు మోక్షం రావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తనయుడు రానా దగ్గుబాటి నటుడిగా టాలీవుడ్‌తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీల్లోనూ మంచిపేరు తెచ్చుకున్నాడు. దీంతో సురేశ్ బాబు రెండో తనయుడు అభిరామ్ కూడా సినిమాలవైపే అడుగువేశాడు. తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమాకు ఆరంభం నుంచే కష్టాలు వెంటాడాయి. దీంతో సినిమా దాదాపు రెండేండ్లు సెట్స్‌పైనే ఉంది. చివరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ ఏడాది జూన్ 2వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ సినిమా దగ్గుబాటి ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. డిజాస్టర్ టాక్ రావడంతో విడుదలైన వారం రోజుల్లోనే సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది.
అహింస సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. కానీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. చాలాసార్లు ఓటీటీ రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తూ వచ్చింది. సెప్టెంబర్‌లోనే ఈ సినిమా టీవీల్లోనూ టెలికాస్ట్ అయ్యింది. అయినప్పటికీ ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ పట్టించుకోలేదు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు అహింస సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

