యువతకు రోల్‌మోడల్ ముత్తయ్య
క్రికెట్ అంటే రికార్డులు కాదు. స్నేహితుల్ని చేసుకోవడం. మైదానంలో మేం వేరువేరు దేశాలతో ఆడినప్పటికీ నేనూ, సచిన్, అనిల్‌కుంబ్లే, గంగూలీ స్నేహితులుగా ఉన్నాం. మా స్నేహం దేశాలకు అతీతమైనది’ అన్నారు క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్.
క్రికెట్ అంటే రికార్డులు కాదు. స్నేహితుల్ని చేసుకోవడం. మైదానంలో మేం వేరువేరు దేశాలతో ఆడినప్పటికీ నేనూ, సచిన్, అనిల్‌కుంబ్లే, గంగూలీ స్నేహితులుగా ఉన్నాం. మా స్నేహం దేశాలకు అతీతమైనది’ అన్నారు క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం మధుర్ మిట్టల్ నటించగా, మురళీధరన్ భార్య మదిమలర్గా మహిమా నంబియార్ కనిపిస్తారు. ఎం.ఎస్.శ్రీపతి దర్శకుడు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముత్తయ్య మురళీధరన్ మాట్లాడారు. ‘నా కథతో సినిమా అన్న ఫీలింగే గుండెను బరువు చేస్తున్నది. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను’ అన్నారు ముత్తయ్య. ‘ప్రపంచ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. ఆటగాడిగానే కాదు, మనిషిగా కూడా ఆయన ఆదర్శప్రాయుడే. ముత్తయ్య గొప్ప మనసున్న వ్యక్తి, నిగర్వి, ఈ తరం యువతకు రోల్ మోడల్. అలాంటి వ్యక్తి జీవితంతో సినిమా రావడం ఆనందంగా ఉంది. ఈనాటికీ ఆయన నన్ను ఇన్స్పైర్ చేస్తూనే వున్నాడు. ఆయనతో కలిసి ఆడాను. ఆపోజిట్‌గా ఆడాను. ముత్తయ్య లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం’ అని వీవీఎస్ లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

