Nani 30 | నాని 30 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్..!
న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న దసరా సినిమామార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో మరోవైపు నాని 30 (Nani 30) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
న్యాచురల్ స్టార్ నాని (Nani) మరికొన్ని రోజుల్లో దసరా సినిమాతో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా జనవరి 30న దసరా టీజర్ రాబోతున్నట్టు ఇప్పటికే స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపాడు నాని.
ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో మరోవైపు నాని 30 (Nani 30) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవతుందనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఫిలింనగర్ సర్కిల్ సమాచారం ప్రకారం షూటింగ్ ఫిబ్రవరి 1 నుంచి షురూ కానుంది.
వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మిస్తున్నారు. సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్ కాగా.. మలయాళం కంపోజర్, హృదయం ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు గ్లింప్స్ వీడియోతో తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన దసరా రషెస్ చూస్తే నాని ఇదివరకెన్నడూ కనిపించని పక్కా మాస్ లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ ఇందులో డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనుంది. మరోవైపు దసరా నుంచి విడుదలైన ధూమ్ ధామ్ దోస్తాన్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
నాని 30 గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

