Christopher Nolan | హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఓడిస్సి’ (The Odyssey) వరల్డ్ ప్రీమియర్ కోసం చిత్ర బృందం భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ముంబై నగరానికి విచ్చేసిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, హాలీవుడ్ స్టార్ నటులు మ్యాట్ డామన్, టామ్ హాలండ్.. రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు వెళ్లే ముందు ముంబైలోని ఒక స్థానిక కేఫ్‌లో సందడి చేశారు. పక్కా దేశీ స్టైల్లో వేడి వేడి ఇరానీ ఛాయ్, బన్ మస్కా తింటూ వారు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
హాలీవుడ్ అగ్ర దర్శకుడు, నటులు ఇలా ముంబై వీధుల్లో సాధారణంగా కూర్చుని టీ తాగడం చూసి భారతీయ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా స్పైడర్‌మ్యాన్ నటుడు టామ్ హాలండ్ టీ తాగుతున్న లుక్‌ను చూసి, ‘స్పైడర్‌మ్యాన్ అక్రాస్ ది స్పేస్ వెర్స్’ చిత్రంలోని ఇండియన్ స్పైడర్‌మ్యాన్ పవిత్ర ప్రభాకర్ క్యారెక్టర్‌తో నెటిజన్లు పోల్చుతూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. లండన్, ప్యారిస్, న్యూయార్క్ నగరాలతో పాటు ముంబైని కూడా ఈ చిత్ర గ్లోబల్ ప్రీమియర్ టూర్లో చేర్చడం విశేషం. హోమర్ రాసిన పురాతన గ్రీకు పురాణాల ఆధారంగా, ప్రపంచంలోనే మొదటిసారిగా పూర్తిగా ఐమాక్స్ (IMAX) కెమెరాలతో రూపొందించిన ఈ అడ్వెంచర్ ఎపిక్ మూవీ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Every great story deserves a chai break.
Matt Damon and Tom Holland know the secret. ☕🎬#OdysseyPremiereChaiTime pic.twitter.com/rVbFZXEhOu�— Afjal Khan6💫 (@AfjalKhan991627) July 11, 2026
Quick tea stop before The Odyssey Mumbai Premiere
A Big night awaits, but chai comes first!#OdysseyMumbaiPremiere pic.twitter.com/bzNSjIcQG6
— Universal Pictures India (@UniversalIND) July 11, 2026