Chiranjeevi | చిరంజీవి సినిమా సెట్లో అగ్ని ప్రమాదం.. ఏకంగా పాతిక కోట్లు నష్టం
ఫలితం ఎలా ఉన్నా 'ఆచార్య' సినిమాలోని సెట్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా టెంపుల్ సెట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆచార్య షూటింగ్ మొదలు పెట్టకముందు చిత్రయూనిట్ ఎన్నో ప్రదేశాలు తిరిగి చివరకి వాళ్లు అనుకున్న టెంపుల్ కనిపించకపోయే సరికి స్వయంగా టెంపుల్నే సెట్ వేశారు.
Acharya Movie set | ఫలితం ఎలా ఉన్నా ‘ఆచార్య’ సినిమాలోని సెట్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా టెంపుల్ సెట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆచార్య షూటింగ్ మొదలు పెట్టకముందు చిత్రయూనిట్ ఎన్నో ప్రదేశాలు తిరిగి చివరకి వాళ్లు అనుకున్న టెంపుల్ కనిపించకపోయే సరికి స్వయంగా టెంపుల్నే సెట్ వేశారు. కోకాపేటలోని 20ఎకరాల్లో దాదాపు పాతిక కోట్లు ఖర్చుపెట్టి ధర్మస్థలి సెట్‌ను రూపొందించారు. రిలీజ్‌కు ముందు ఈ సెట్ గురించి ప్రత్యేకంగా చర్చలు కూడా జరిగాయి. కాగా తాజాగా ఈ సెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో స్థానికులు గమనించి దగ్గరలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే సెట్ దాదాపుగా కాలిపోయింది.
కాగా ఇలా సెట్లో ఒక్కసారిగా మంటలు రావడానికి కారణం ఎవరో ఒక వ్యక్తి ప్రధాన ద్వారం వద్ద కూర్చొని సిగరెట్ తాగి.. అక్కడే సిగరెట్ ముక్కను పారేయడంతో కొంచెం కొంచెంగా మంటలు చెలరేగాయని తెలుస్తుంది. ఈ సెట్‌ను సురేష్ రూపొందించాడు. ఇక చరణ్, చిరు తొలిసారి కలిసి నటించిన ఆచార్య బాక్సాఫీస్ దగ్గర భారి పరజయాన్ని మూటగట్టుకుంది. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. తీరా రిలీజయ్యాక అంచనాలు అందుకోలేక తొలివారంలోనే సగం వరకు థియేటర్లను ఖాళీ చేసింది. అప్పటివరకు వరస హిట్లతో దూసుకుపోతున్న కొరటాలశివకు ఆచార్య బ్రేకులు వేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

