కదిరి కాళిదాసు ఉగ్రరూపం
అగ్ర నటుడు చిరంజీవి ‘కాకా’ చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
అగ్ర నటుడు చిరంజీవి ‘కాకా’ చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో సత్యం, కదిరి కాళిదాస్‌గా రెండు భిన్న పార్శాలున్న పాత్రలో కనిపించారు చిరంజీవి. ఓ మధ్యతరగతి వ్యక్తి జీవిత ప్రయాణం, అతని తాలూకు ఓ రహస్యమైన గతం, తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
దీపావళి సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పచ్చని పొలాల మధ్య కొడవలి పట్టుకొని ఆగ్రహంగా కనిపిస్తున్నారు చిరంజీవి. కుటుంబ శ్రేయస్సు కోసం కాకా చేసే పోరాటం ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తమని, చిరంజీవి పాత్ర ఆద్యంతం ఎమోషనల్‌గా సాగుతుందని మేకర్స్ తెలిపారు. అనస్వరరాజన్, నివేదా థామస్, అనురాగ్ కశ్యప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాత: వెంకట్ కె నారాయణ, రచన-దర్శకత్వం: బాబీ కొల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

