Tiger Nageswara Rao | ఆ స్టార్ హీరో ‘టైగర్ నాగేశ్వరరావు’ ముహూర్తానికి గెస్ట్‌గా రానున్నాడా?
మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈయన ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేయాలనే ప్లాన్‌లో వరుసగా కథలను వింటూ నచ్చిన వాటిని ఓకే చేస్తున్నాడట.
Ravi Teja Tiger Nageswara Rao | మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈయన ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేయాలనే ప్లాన్‌లో వరుసగా కథలను వింటూ నచ్చిన వాటిని ఓకే చేస్తున్నాడట. ఇటీవలే రవితేజ ‘ఖిలాడి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే ‘రామారావు’ షూటింగ్ పూర్తీ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. జూన్ 17న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇక ‘రావణాసుర’, ‘ధమాకా’ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటుగా టైగర్ నాగేశ్వరరావు సినిమా చేయబొతున్నాడు.
ఈ చిత్రం ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కనుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కనుంది అనడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ‘దొంగాట’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమాలు ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన జరుగనున్నాయి. అయితే ఈ చిత్ర లాంఛనింగ్ కార్యక్రమాలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నిర్మిస్తున్నాడు.
This cannot get bigger 🤩
Megastar @KChiruTweets will grace the opening ceremony of @RaviTeja_offl’s #TigerNageswaraRao 🐅@DirVamsee @abhishekofficl @NupurSanon @gaya3bh @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @MayankOfficl @CastingChhabra pic.twitter.com/TsWhnoZuNt
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) April 1, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

