Chinmayi | బీఫ్ తినేవాడు రాముడి పాత్ర పోషిస్తున్నాడు..నెటిజన్ మాటలకి చిన్మయి కౌంటర్..!
Chinmayi | సింగర్ చిన్మయి శ్రీపాద తప్పుడు వ్యాఖ్యలు చేసే వారికి గట్టిగా ఇచ్చి పడేస్తుంటుంది. తనని విమర్శించిన లేదంటే సమాజంలో జరిగే సంఘటలన గురించి తప్పుగా మాట్లాడిన సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందిస్తుంది. తాజాగా బీఫ్ తినే నటుడు రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్ర పోషించడాన్ని విమర్శిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు చిన్మయి రిప్లై ఇచ్చిన తీరు చర్చనీయాంశం అయింది.
Chinmayi | సింగర్ చిన్మయి శ్రీపాద తప్పుడు వ్యాఖ్యలు చేసే వారికి గట్టిగా ఇచ్చి పడేస్తుంటుంది. తనని విమర్శించిన లేదంటే సమాజంలో జరిగే సంఘటలన గురించి తప్పుగా మాట్లాడిన సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందిస్తుంది. తాజాగా బీఫ్ తినే నటుడు రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్ర పోషించడాన్ని విమర్శిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు చిన్మయి రిప్లై ఇచ్చిన తీరు చర్చనీయాంశం అయింది. ఓ యూజర్ “బీఫ్ తినే రణ్‌బీర్ రాముడి పాత్ర పోషించడమేంటి? మన కర్మ!” అని ట్వీట్ చేయగా, చిన్మయి స్పందిస్తూ..“దేవుడి పేరుతో ఓ బాబాజీ రేప్ చేస్తాడు… జైల్లో నుంచి బయటకు వచ్చిఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవొచ్చు.. ఇదే భక్త్ ఇండియా.. అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే.. అదేం పెద్ద సమస్య కాదుగా అని చిన్మయి రాసుకొచ్చింది.
చిన్మయి వ్యాఖ్యల పట్ల నెటిజన్స్ రెండుగా విడిపోయారు.. కొంతమంది ఆమెకు మద్దతు తెలుపగా, మరికొంతమంది విమర్శల దాడికి దిగారు.“ఒక చెడ్డ పని (బీఫ్ తినడం) ని ఇంకొక చెడ్డ పనితో (రేపిస్టులు రాజ్యమేలడం) ఎలా కంపేర్ చేస్తారు?” అని ప్రశ్నించగా,దానికి స్పందించిన చిన్మయి.. ఒక రేపిస్ట్ ఎంపీ గెలిస్తే మీకు ఏమీ అనిపించదు. కానీ బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్ర పోషిస్తే మాత్రం గుండెల్లో మంట. ఈ విషయంలో మీకు ఏం అనిపించడం లేదా ?” అని కౌంటర్ ఇచ్చారు. మీరు మీ ఫెమినిజం, ఫెమినిస్ట్ వరకు ఉండండి.. ఈ మ్యాటర్‌లోకి దూరకండి అని ఓ నెటిజన్ వార్నింగ్ ఇచ్చారు. ఆ ట్వీట్‌కి కూడా చిన్మయి సమాధానం ఇచ్చారు.
“దేవుడి పేరుతో అటెన్షన్ అందిపుచ్చుకునే వాళ్లు ఎలా నాశనం అవుతున్నారో చూస్తూనే ఉన్నాం అంటూ రిప్లై ఇచ్చింది. ఇక ఈ వివాదానికి నేపథ్యం అయిన నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ‘రామాయణ’ సినిమా గ్లింప్స్ ఇప్పటికే భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ బీజీఎంలు, విజువల్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. వచ్చే దీపావళి (2025)కి మూవీ విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

