Charlotte Telugu Sambaralu | అమెరికాలో ఘనంగా షార్లెట్ తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం!
NAATSMichigan | అమెరికాలోని షార్లెట్‌లో ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నారులు, యువత, పెద్దలు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, ఫ్రీస్టైల్ డ్యాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
అమెరికాలోని షార్లెట్‌లో ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నారులు, యువత, పెద్దలు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, ఫ్రీస్టైల్ డ్యాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సైన్స్ ఫెస్ట్‌లో తొమ్మిది శాస్త్రీయ అంశాలను ప్రయోగాలు, డెమోన్స్ట్రేషన్ల ద్వారా చిన్నారులకు పరిచయం చేశారు. ముఖ్యంగా డ్రై ఐస్ ప్రయోగాలు, ప్లాస్మా బాల్ ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తానా, జీటీఏ, ఆప్టా తదితర ప్రముఖ తెలుగు సంస్థలు భాగస్వాములైన ఈ వేడుకలకు నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏకంగా 800 కొత్త రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన కళాకారులు, చిన్నారులు, తల్లిదండ్రులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, సంస్థల ప్రతినిధులు మరియు ప్రేక్షకులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా, తెలుగు సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాల విస్తరణ, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ముఖ్యమైన లక్ష్యంతో నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (నాట్స్) మిషిగన్ చాప్టర్‌ను ఫార్మింగ్టన్ హిల్స్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ కొత్త చాప్టర్ కోఆర్డినేటర్‌గా శ్రీదేవి మణేపల్లి, జాయింట్ కోఆర్డినేటర్‌గా మహి బొల్లవరం నియమితులయ్యారు. అలాగే రవి చాలంటి ఈవెంట్స్ మరియు లాజిస్టిక్స్ బాధ్యతలు, హేమ సూరపరాజు ట్రెజరర్‌గా, జ్యోతి జవ్వాది సభ్యత్వ బాధ్యతలు, అనుపమ దివాకర్ల పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల మాట్లాూడుతూ సంస్థ అందిస్తున్న హెల్ప్‌లైన్ సేవలను, అవసరంలో ఉన్న తెలుగు వారికి ఇస్తున్న ఆసరాను వివరించారు. అధ్యక్షుడు రాజ్ అల్లాడా మాట్లాడుతూ సమాజ సేవకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని, కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ వేడుకల సందర్భంగా మనోరమ గాంధీ, కూచిపూడి కళా ప్రోత్సాహకురాలు సంధ్య శ్రీ ఆత్మకూరి, తెలుగు భాషా కార్యక్రమం ‘మనబడి’, సామాజిక సేవకుడు సన్నీ రెడ్డి, అలాగే వైద్య మరియు సినీ రంగాల్లో విశేష సేవలందిస్తున్న డాక్టర్ హరినాథ్ పోలిచెర్లను ఘనంగా సత్కరించారు. స్థానిక విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆప్టా, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్, డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం, సాధికారత, యువ నాయకత్వం, క్రీడలు, కుటుంబ కార్యక్రమాలు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా ప్రతి మూడు నెలలకు కనీసం ఒక ప్రధాన సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని మిషిగన్ చాప్టర్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి పీఆర్వోగా జీకే మీడియా గణేష్ కుమార్ వ్యవహరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

