Chandramukhi-2 | వామ్మో చంద్రముఖి సీక్వెల్‌కు అంత లెంగ్తీ రన్‌టైమా?
Chandramukhi-2 | చంద్రముఖి సినిమాకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్ అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Chandramukhi-2 | చంద్రముఖి సినిమాకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్ ఏ రేంజ్లో అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైగా లారెన్స్, కంగానా వంటి ధీటైన నటులు సినిమాలో భాగం కావడంతో అందరిలోనూ అమితాసక్తి ఏర్పడింది. కట్ చేస్తే రెండు వారాల కిందట రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను కొసమెరుపు కూడా ఆకట్టుకోలేకపోయింది. దానికి తోడు ట్రోలర్ రాయుళ్లకు కావాల్సిన స్టఫ్ అంతా ట్రైలర్లోనే కనిపించింది. ఇక కథ కూడా ఏ మాత్రం మార్చినట్లు లేదు. అదే కథను 4కేలో చూపించబోతున్న ఫీలింగ్ కలుగుతుంది.
పైగా రిలీజ్ డేట్ వాయిదా పడటం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. ఎందుకంటే ఈ శుక్రవారం మార్క్ ఆంటోని తప్పితే బజ్ ఉన్న సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. పైగా లారెన్స్‌తో పోల్చితే విశాల్‌కు ఇక్కడ అంత మార్కెట్ లేదు. క్రేజ్ కూడా లేదు. అలాంటిది ఈ రోజు వచ్చుంటే మట్టుకు సినిమా ఎలాగున్నా మంచి ఓపెనింగ్స్ మాత్రం దక్కేవి. ఇన్ని గందరగోళాల మధ్య ఈ సినిమా నిడివి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలట. ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌లో ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి.
కథలో కొత్తదనం ఉండి, కాస్త ఎంటర్టైన్ చేయగలిగితే ఒకే కానీ.. కంటెంట్‌లో ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వచ్చే చాన్స్ ఉంది. పైగా ఈ మధ్య రిలీజైన ఖుషి కేవలం రన్‌టైమ్ ఎక్కువ ఉండటంతోనే రివ్యూలు అలా వచ్చాయన్నది ఓపెన్ టాక్. పైగా చంద్రముఖి ఒరిజనల్ వెర్షన్ 2గంటల 46 నిమిషాలు. ఇక ఇప్పుడు 4 నిమిషాలు అదనంగా ఈ సినిమా నిడివి ఉండనుంది. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. దీనికి రామ్ స్కంద గట్టి పోటీని ఇవ్వనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

