Chandini Chowdary | ఆ నిర్మాత వల్ల రెండేళ్లు వృథా అయ్యాయి.. చాందిని చౌదరి సంచలన వ్యాఖ్యలు
Chandini Chowdary | అచ్చ తెలుగు సోయగం.. చాందిని చౌదరి! తీర నగరం విశాఖలో పుట్టిపెరిగిన ఈ భామ.. లఘుచిత్రాలతో కెరీర్ మొదలుపెట్టింది. ‘కేటుగాడు’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. ‘మను’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. ‘కలర్ ఫొటో’తో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నది. తాజాగా.. విశ్వక్సేన్తో కలిసి ‘గామి’ చిత్రంలో పెద్దపెద్ద సాహసాలే చేసింది.
Chandini Chowdary | అచ్చ తెలుగు సోయగం.. చాందిని చౌదరి! తీర నగరం విశాఖలో పుట్టిపెరిగిన ఈ భామ.. లఘుచిత్రాలతో కెరీర్ మొదలుపెట్టింది. ‘కేటుగాడు’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. ‘మను’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. ‘కలర్ ఫొటో’తో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నది. తాజాగా.. విశ్వక్సేన్తో కలిసి ‘గామి’ చిత్రంలో పెద్దపెద్ద సాహసాలే చేసింది. అందం.. అభినయంతో టాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయితో మాటా ముచ్చట!
నా అభిమాన దర్శకుడు మణిరత్నం. ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో నటించాలన్నది నా కల. అన్ని జానర్స్ సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం.
నేను చిన్నప్పుడు త్రోబాల్ బాగా ఆడేదాన్ని. అందులో చాంపియన్‌ను కూడా! కథలు కూడా బాగా రాసేదాన్ని. పెద్దయ్యాక రైటర్‌గా స్థిరపడాలని అనేకునేదాన్ని. ఇండస్ట్రీలో నటన తర్వాత.. దర్శకత్వం చేయాలన్నది నా డ్రీమ్!
ప్లాట్‌ఫామ్ ఏదైనా.. మంచి పాత్ర ఉంటే తప్పకుండా చేస్తాను. ఈ పాత్రే చేయాలన్న నిబంధన ఏదీ పెట్టుకోలేదు. కానీ, నాకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం.. ఎంత డబ్బు ఇచ్చినా చేయను.
సమయం ఎంతో విలువైనది. సినిమా పరిశ్రమలో దాని విలువ మరింత ఎక్కువ. అయితే, ఒక నిర్మాత వల్ల రెండేళ్ల సమయం వృథా చేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే.. ఈపాటికి ఇంకా మంచిస్థాయిలో ఉండేదాన్ని.
కొన్ని కథలు విన్నప్పుడు.. నన్ను నేను నియంత్రించుకోలేను. ‘గామి’ అలాంటిదే! ఈ కథ విన్నప్పుడే.. ఈ చిత్రంలో తప్పకుండా భాగం కావాలని ఫిక్సయ్యాను. మామూలుగా అయితే.. ఒక కథకు ఓకే చెప్పడానికి నేను కొంచెం టైమ్ తీసుకుంటాను. ‘గామి’కి మాత్రం వెంటనే ఓకే చెప్పేశాను. నా మనసుకు చాలా తృప్తినిచ్చిన సినిమా ఇది.
‘గామి’ ప్రయాణమంతా ఓ సాహస యాత్రలా సాగింది. హిమాలయాల్లో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ చేశాం. అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. విశ్వక్, నేను ఆక్సిజన్ ట్యాంక్స్ పట్టుకుని వెళ్లి.. నటించాల్సి వచ్చేది. కొన్ని సీన్స్‌లో రోప్స్ సహాయంతో వేలాడటం.. కొండల మీదినుంచి దూకడంలాంటి సాహసాలు కూడా చేయాల్సి వచ్చింది.
ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే లక్ష్యంతోనే పనిచేస్తాం. అందుకోసం ఎంతో కష్టపడతాం. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. వాటితో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. పనిలో సాగిపోవాలన్నదే నా సిద్ధాంతం.
పరిశ్రమకు వచ్చి అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయంటే.. నమ్మలేకుండా ఉన్నా! కొత్తలో ఎవరితో.. ఎలా మాట్లాడాలో కూడా సరిగ్గా తెలిసేది కాదు. కానీ, ఈ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అయితే, ఈ ప్రయాణం ఇక్కడితోనే ఆగిపోయేది కాదు. పరిశ్రమ నన్ను గుర్తుంచుకునేలా.. ఏదో ఒకటి చేయాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Air Pollution | ఢిల్లీలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్.. 325కి పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..!
బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులకు మంటలు.. మూడు బస్సులు దగ్ధం!
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల వివాదం.. నిందితుడికి ఊరటనిచ్చిన ముంబై కోర్టు
Ramayana | రామాయణం బాక్సాఫీస్ డే 10.. రూ. 1200 కోట్ల క్లబ్లో చేరిన రణ్‌బీర్-యశ్ చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

