‘హిందీ చిత్ర పరిశ్రమను చికాకు పెడుతున్న బాయ్‌కాట్ ట్రెండ్‌పై అక్కడి తారలు ధీటుగానే స్పందిస్తున్నారు. ‘సినిమా అనేది ప్రేక్షకులకు ఒక ఆప్షన్ మాత్రమే, కంపల్సరీ కాదు’ అని చెప్పేస్తున్నారు. ఈ ట్రెండ్ మొదలైన ప్రారంభంలో అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ ..‘ఇలాంటి పిలుపులు సరికాదు’ అని వినయంగా చెప్పే ప్రయత్నం చేయగా..అర్జున్ కపూర్ లాంటి మరికొందరు హీరోలు ఇలాంటివి ఉపేక్షించకూడదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
త్వరలో విడుదల కానున్న మరో భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’కు ఇప్పటి నుంచే బాయ్ కాట్ ‘బ్రహ్మాస్త్ర’ అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ‘మీకు మేము నచ్చితే చూడండి లేకపోతే లేదు’ అంటూ ఆలియా భట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పట్టెడు సినిమాలు ఆడకుంటే మొత్తం సినిమాలనే బాయ్ కాట్ చేయాలనే పిలుపు సరికాదన్నది బాలీవుడ్ వాసుల మాట.