ఊహకందని కలయిక?
‘అఖండ 2’ తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరోతో సినిమా చేస్తారు? అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బన్నీతో బోయపాటి సినిమా ఉంటుందనే వార్త కూడా మీడియా సర్కిల్స్‌లో వినిపించింది.
‘అఖండ 2’ తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరోతో సినిమా చేస్తారు? అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బన్నీతో బోయపాటి సినిమా ఉంటుందనే వార్త కూడా మీడియా సర్కిల్స్‌లో వినిపించింది. అయితే.. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది దాకా ఆయన దొరకడం కష్టం. మిగతా స్టార్ హీరోలు కూడా వారివారి ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నారు. దాంతో బోయపాటి తన నెక్ట్స్ సినిమాను ఎవరితో చేస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా, తెలుగు ప్రేక్షకులకు ఇష్టుడైన కోలీవుడ్ హీరో కార్తీతో బోయపాటి సినిమా చేయనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త వెలుగు చూసింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఎంటర్టైనర్లను ఎక్కువగా చేసే కార్తీ.. బోయపాటి సినిమా చేస్తే అది నిజంగా ఆడియన్స్‌కి సర్ప్రైజే. కార్తీ కూడా ఓ కొత్త ప్రయత్నం చేసినట్టే. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

