Bootcut Balaraju | తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’(Bootcut Balaraju). మేఘ లేఖ కథనాయికగా నటించగా శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించాడు. గ్లోబల్ ఫిలిమ్స్, కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండీ పాషా ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
అయితే ఈ సినిమా విడుదలైన అనంతరం థియేటర్ ముందు సోహైల్ చేసిన రచ్చ గురించి తెలిసిందే. సినిమా చూసేందుకు ఓ థియేటర్‌కు వెళ్లిన సోహైల్ ఆ థియేటర్లో ఎవరు లేకపోవడంతో తన ఆవేదన వెళ్లగక్కాడు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఈ చిత్రంకు సంబంధించి ఓటీటీ అప్డేట్ వచ్చింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 1 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Telugu Film #BootCutBalaraju Digital Premieres March 1st on @PrimeVideoIN pic.twitter.com/U2PBK2PNiB
— Celer OTT Updates (@celerottupdates) February 21, 2024