Bimbisara US collections | పాజిటివ్ టాక్..బింబిసార, సీతారామం యూఎస్ కలెక్షన్లివే..!
నందమూరి కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ పోషించిన బింబిసార (Bimbisara). వార్ బ్యాక్ డ్రాప్ ప్రేమకథతో హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కించిన చిత్రం సీతారామం (Sita Ramam).
టాలీవుడ్ లో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టులు హీరో నందమూరి కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ పోషించిన సినిమా బింబిసార (Bimbisara). వశిష్ఠ్ (Vasisth) దర్శకత్వం వహించాడు. మరోవైపు వార్ బ్యాక్ డ్రాప్ ప్రేమకథతో హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కించిన చిత్రం సీతారామం (Sita Ramam). నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌తో ఓపెనింగ్ డేను షురూ చేశాయి.
సీతారామం 182 లొకేషన్లలో విడుదలవగా..బింబిసార 99 లొకేషన్లలో విడుదలైంది. తాజాగా ఈ రెండు చిత్రాలు యూఎస్‌లో రాబట్టిన ప్రీమియర్ కలెక్షన్లకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సీతారామం చిత్రం తాజా అప్ డేట్ ప్రకారం యూఎస్‌లో రూ.43,27,824.08 డాలర్లు ($54,627) రాబట్టగా..మరోవైపు బింబిసార రూ.27,88,323.88 ( $35,195) రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. మొత్తం కలెక్షన్లపై అధికారిక అప్డేట్ రానుందని టాక్.
మలయాళ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించిన సీతారామంలో బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని బయోపిక్‌గా వచ్చిన బింబిసారలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

