వినోదాలు పంచే ‘లక్కీ లక్ష్మణ్’
బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్'. ఏ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్నారు.
బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. ఏ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్నారు. ఈ నెల 30న విడుదలకానుంది. శనివారం టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిది. థియేటర్ నుంచి చిరునవ్వుతో బయటకు వస్తారు. సోహైల్ అద్భుతమైన నటనను కనబరిచాడు’ అని చెప్పారు. “బిగ్‌బాస్’ నుంచి వచ్చిన తర్వాత విడుదలవుతున్న నా తొలి చిత్రమిది.
జీవితంలో చాలా ఏళ్లు కష్టపడ్డాను. ఈ సినిమా ద్వారా మంచి అవకాశమొచ్చింది. టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తుంటే సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది’ అని హీరో సోహైల్ తెలిపారు. అన్ని విభాగాల శ్రమతో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దామని, తప్పకుండా అందరిని మెప్పించే చిత్రమవుతుందని నిర్మాత హరిత గోగినేని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌రూబెన్స్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ.ఆర్.అభి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

