Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కెప్టెన్సీ టాస్కులు, నామినేషన్లతో హౌస్‌లో రచ్చ కొనసాగుతోంది. గ్రూపులుగా విడిపోయి టాస్కులు ఆడుతున్న కంటెస్టెంట్లు నామినేషన్ల నుంచి తప్పించుకోవడంతో పాటు కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన కెప్టెన్సీ పోటీలో సుధీర్ రెడ్డి విజయం సాధించి హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా నిలిచాడు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కెప్టెన్సీ టాస్కులు, నామినేషన్లతో హౌస్‌లో రచ్చ కొనసాగుతోంది. గ్రూపులుగా విడిపోయి టాస్కులు ఆడుతున్న కంటెస్టెంట్లు నామినేషన్ల నుంచి తప్పించుకోవడంతో పాటు కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన కెప్టెన్సీ పోటీలో సుధీర్ రెడ్డి విజయం సాధించి హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా నిలిచాడు. మరోవైపు, తమ బ్యాచ్ నుంచి ఎవరూ కెప్టెన్ కాలేదనే నిరాశ అగ్నిపరీక్ష సభ్యుల్లో కనిపించింది. తాజా టాస్కుల్లో ముకేశ్–ఝాన్సీ, షాలిని–రోహిత్ జంటలు చివరి స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు జంటల్లో ఒక్కొక్కరు మాత్రమే టాస్క్ ఆడాలని, మరొకరు డేంజర్ జోన్లో ఉండాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ఝాన్సీ తాను డేంజర్ జోన్లో ఉంటానని, ముకేశ్‌ను కాపాడుకుంటానని చెప్పింది. మరోవైపు షాలిని కూడా డేంజర్ జోన్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే రోహిత్ మాత్రం తాను డేంజర్ జోన్లో ఉంటానని, షాలిని టాస్క్ ఆడుతుందని చెప్పాడు.
ఆ తర్వాత ‘ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్’ అనే టాస్క్ నిర్వహించారు. ఇందులో టైల్స్ కింద ఉన్న ఛాలెంజ్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. దేబ్జానీ, ఝాన్సీ సంచాలకులుగా వ్యవహరించారు. ఈ టాస్కులో కంటెస్టెంట్లకు వచ్చిన ఛాలెంజ్‌లతో హౌస్‌లో సరదా వాతావరణం నెలకొంది. చివరకు రామ్ ప్రసాద్, నరేష్ ఈ టాస్కులో విజయం సాధించారు. అయితే తదుపరి దశలో ఒకరు సేఫ్ అవ్వగా, మరొకరు డేంజర్ జోన్లోకి వెళ్లాల్సి రావడంతో రామ్ ప్రసాద్ సేఫ్ అయ్యాడు. నరేష్ నామినేషన్ల ప్రమాదంలో పడ్డాడు. టాస్కుల అనంతరం సుధీర్, వంశీ, వర్షిణి, అమన్, త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించారు. తనకు ఉన్న మ్యాజిక్ పవర్‌ను ఉపయోగించుకున్న ఝాన్సీ ఈ వారం నామినేషన్ల నుంచి తప్పించుకుంది. అయితే ఆమె కెప్టెన్సీ పోటీలో పాల్గొనే అవకాశం మాత్రం కోల్పోయింది.
మరోవైపు కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించిన ఏడుగురిలో ఇద్దరు తప్పుకోవాలని బిగ్‌బాస్ చెప్పడంతో హౌస్‌లో చర్చ మొదలైంది. వర్షిణి, అమన్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ విషయంలో అమన్, రోహిత్ మధ్య చర్చ జరగడంతో పాటు ఇతర కంటెస్టెంట్లతోనూ వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బిగ్‌బాస్ నిర్ణయం మేరకు సుధీర్, వంశీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ కెప్టెన్సీ టాస్కులో పాల్గొన్నారు. కెప్టెన్సీ కోసం ఐదుగురికి షిప్ తయారు చేసే టాస్క్ ఇచ్చారు. బీన్ బ్యాగుల్లో ఉన్న షిప్ భాగాలను బయటకు తీసి, ఇచ్చిన నమూనా ప్రకారం షిప్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ టాస్కులో మొదటగా పూర్తి చేసిన ముగ్గురు తదుపరి దశకు వెళ్లగా, త్రిగుణ్, దేబ్జానీ పోటీ నుంచి తప్పుకున్నారు.
తదుపరి దశలో సుధీర్, వంశీ, రామ్ ప్రసాద్ పోటీపడ్డారు. ఈ దశలో సుధీర్ ముందంజలో నిలిచి చివరి పోటీకి చేరుకున్నాడు. తనకు మద్దతుగా ఝాన్సీ సహాయం తీసుకున్న సుధీర్, ఆమె సహకారంతో టాస్కును వేగంగా పూర్తి చేశాడు. చివరకు కెప్టెన్సీ పోటీలో సుధీర్ రెడ్డి విజయం సాధించాడు. దీంతో ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. విజయం సాధించిన అనంతరం సుధీర్, రామ్ ప్రసాద్ కాళ్లకు నమస్కరించడం కూడా హౌస్‌లో చర్చనీయాంశమైంది. సుధీర్‌కు కెప్టెన్‌కు ఇచ్చే గోల్డ్ మెడల్‌ను అందించారు.
మరోవైపు, తమ బ్యాచ్ నుంచి ఎవరూ కెప్టెన్ కాలేకపోవడంతో అగ్నిపరీక్ష సభ్యులు నిరాశకు గురైనట్లు కనిపించారు. ఈ విషయాన్ని సుధీర్ కూడా రామ్ ప్రసాద్‌తో ప్రస్తావించాడు. మొత్తానికి కెప్టెన్సీ టాస్కులతో హౌస్‌లో గ్రూపుల మధ్య విభేదాలు మరింత పెరగగా, సుధీర్ విజయం ఈ వారం ఎపిసోడ్లో కీలక ఘట్టంగా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aman
- bigg boss
- bigg boss 10
- captain
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

