Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్ రోజురోజుకూ ఆసక్తికర మలుపులతో సాగుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్‌పై ఉత్కంఠ నెలకొంది.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్ రోజురోజుకూ ఆసక్తికర మలుపులతో సాగుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా కంటెస్టెంట్లు దక్షి, శాలిని హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దక్షి ప్రారంభం నుంచే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ కాదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమె రాకతో గేమ్‌లో కొత్త ఉత్సాహం వస్తుందని ప్రేక్షకులు ఆశించారు. కానీ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఇతర కంటెస్టెంట్లతో కలిసిపోవడం, టాస్కుల్లో తనదైన ముద్ర వేయడం వంటి విషయాల్లో ఆమె ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఫిజికల్ టాస్కుల్లోనూ, గేమ్ వ్యూహాల్లోనూ తన ప్రత్యేకతను నిరూపించుకోలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఓటింగ్‌లో వెనుకబడిందని, కేవలం రెండు వారాలకే ఆమె బిగ్‌బాస్ ప్రయాణం ముగిసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఆమె ఎలిమినేషన్‌పై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు శాలిని ప్రయాణం కూడా ఎన్నో మలుపులతో సాగింది. తొలుత ఎలిమినేట్ అయినట్లు కనిపించిన ఆమెను బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్‌కు పంపించాడు. అక్కడి నుంచి హౌస్‌లోని కంటెస్టెంట్ల ఆటతీరును గమనించిన తర్వాత తిరిగి హౌస్‌లోకి ప్రవేశించింది. రీ ఎంట్రీతో శాలిని తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటుందని చాలామంది భావించారు. అయితే, రోహిత్‌తో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఎక్కువగా చర్చకు వచ్చాయి. కొందరు ప్రేక్షకులు ఈ జోడీని ఆదరించగా, మరికొందరు శాలిని తన వ్యక్తిగత ఆటపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు.
టాస్కుల్లో తన సత్తా చాటడంలో వెనుకబడిందనే విమర్శలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో శాలిని కూడా ఏడో వారం ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా క్లారిటీ రావలసి ఉంది. ఎలిమినేషన్ వార్తలతో పాటు ఈ ఇద్దరు కంటెస్టెంట్ల పారితోషికానికి సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దక్షికి వారానికి రూ.2.5 లక్షల చొప్పున పారితోషికం అందినట్లు తెలుస్తోంది. ఆమె రెండు వారాల పాటు హౌస్‌లో కొనసాగితే మొత్తం రూ.5 లక్షలు అందుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక శాలినికి వారానికి రూ.75 వేల చొప్పున పారితోషికం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన ఆమె ఏడు వారాలు హౌస్‌లో ఉన్నందుకు రూ.5.25 లక్షలు అందుకున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

