Peddi | ఓటీటీలో ‘పెద్ది’కి షాక్.. రూ.400 కోట్ల బ్లాక్‌బస్టర్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో నిరాశాజనక ఆరంభం!
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' థియేటర్లలో సంచలన విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే స్థాయి ప్రభంజనం సృష్టిస్తుందని అభిమానులు భావించారు.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ థియేటర్లలో సంచలన విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే స్థాయి ప్రభంజనం సృష్టిస్తుందని అభిమానులు భావించారు. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ఈ సినిమాకు ఊహించని షాక్ ఎదురైంది.జూలై 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన ‘పెద్ది’.. తొలి నాలుగు రోజుల్లో (జూలై 6-12 వీక్లీ డేటా ప్రకారం) కేవలం 1.9 మిలియన్ వ్యూస్ మాత్రమే నమోదు చేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 నాన్-ఇంగ్లిష్ మూవీస్ జాబితాలో ఐదో స్థానానికి పరిమితమైంది. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో వచ్చిన సినిమాకు ఇది ఆశించిన స్థాయి ప్రారంభం కాదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
‘పెద్ది’ ఓటీటీ ఫలితాలపై ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ స్ట్రాటజీ. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసినప్పటికీ, హిందీ వెర్షన్‌ను మాత్రం స్ట్రీమింగ్కు తీసుకురాలేదు. దీంతో భారతదేశంలోనే అతిపెద్ద ఓటీటీ మార్కెట్ అయిన హిందీ ప్రేక్షకులను సినిమా చేరుకోలేకపోయింది. ఇప్పటికే థియేటర్లలో హిందీ వెర్షన్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఓటీటీలో అయినా హిందీ డబ్బింగ్ అందుబాటులో ఉంటుందని భావించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది వీక్షకులను సినిమా కోల్పోయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
‘పెద్ది’ కంటే తక్కువ బడ్జెట్‌తో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అద్భుతమైన స్పందన అందుకున్నాయి. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇక్కా’ జూలై 10న విడుదలై కేవలం మూడు రోజుల్లోనే 4.4 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10లో రెండో స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు, భారతదేశంలో నంబర్-1 చిత్రంగా నిలిచింది. అలాగే జూన్ 25న విడుదలైన చిన్న సినిమా ‘బ్లాస్ట్’ కూడా ఇప్పటికీ టాప్-10లో కొనసాగుతోంది. తొలి వీకెండ్లోనే 4.4 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఒకప్పుడు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో కూడా అదే స్థాయి విజయాన్ని సాధించేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పలు అంశాలు ఓటీటీ విజయాన్ని నిర్ణయిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

