శివ కందుకూరి, రాశి సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. పురుషోత్తం రాజ్ దర్శకుడు. స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి, కార్తిక్ ముడుంబై నిర్మాతలు. మార్చి 31న విడుదల కానుం ది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రతి సన్నివేశాన్ని ఆసక్తిగా మలిచాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది.
ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి ఎడ్జ్ ఆఫ్‌ద సీట్‌గా వుంటుంది. ఈ చిత్రంలో ఏ సన్నివేశాన్ని ప్రేక్షకులు ముందుగా ఊహించడం చాలా కష్టం’ అన్నారు.