Bhola Balayya | ‘భోళా బాలయ్య’ సాంగ్‌తో బర్త్‌డే సెలబ్రేషన్స్ షురూ.. బాలయ్య సేవా గుణాన్ని కొనియాడిన బోయపాటి
Bhola Balayya | టాలీవుడ్ అగ్రహీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఈసారి మరింత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే అభిమానులు బాలయ్య పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా, ‘ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థ ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలతో బాలయ్య బర్త్‌డే ఉత్సవాలను పండుగలా జరుపుతోంది.
Bhola Balayya | టాలీవుడ్ అగ్రహీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఈసారి మరింత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే అభిమానులు బాలయ్య పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా, ‘ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థ ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలతో బాలయ్య బర్త్‌డే ఉత్సవాలను పండుగలా జరుపుతోంది. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ‘భోళా బాలయ్య’ పేరుతో రూపొందించిన ప్రత్యేక సిగ్నేచర్ సాంగ్‌ను ఘనంగా విడుదల చేశారు. బాలకృష్ణ వ్యక్తిత్వం, సేవా కార్యక్రమాలు, అభిమానులతో ఆయనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ బాలకృష్ణ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. సమాజంలో సేవా కార్యక్రమాలు చేసే వారిని ప్రజలు ఎప్పుడూ గౌరవిస్తారని, బాలకృష్ణ కూడా అలాంటి వ్యక్తుల్లో ఒకరని అన్నారు. బాలకృష్ణ గారికి సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కేవలం సినిమాల్లో హీరోగా కనిపించడమే కాదు, నిజ జీవితంలో కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు. అలాగే బాలకృష్ణతో తాను చేసిన సినిమాల ద్వారా ఆయన మాస్ ఇమేజ్ను ప్రేక్షకులకు చూపించానని, ఇప్పుడు ‘భోళా బాలయ్య’ పాట ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోందని చెప్పారు. ఈ పాటలోని సాహిత్యం, సంగీతం, విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.
బాలయ్యపై అభిమానంతో రూపొందించిన ఈ సిగ్నేచర్ సాంగ్‌కు దివాకర్ అమిలినేని సాహిత్యం అందించగా, గాయకుడు కరీముల్లా తన గాత్రంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంగీత దర్శకుడు ఈశ్వర్ దత్తు అందించిన బాణీలు పాటకు మరింత బలం చేకూర్చాయి. కార్యక్రమంలో ‘ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్’ వ్యవస్థాపకుడు అనంతపురం జగన్‌తో పాటు పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. బాలకృష్ణ పుట్టినరోజుకు ముందే విడుదలైన ‘భోళా బాలయ్య’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతోంది. అభిమానులు ఈ పాటను విస్తృతంగా షేర్ చేస్తూ బాలయ్య బర్త్‌డే వేడుకలను మరింత సందడిగా మార్చుతున్నారు. ఇదిలా ఉంటే, బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకులు గోపీచంద్ మలినేని, కొరటాల శివలతో ఆయన చేస్తున్న ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాలకు సంబంధించిన ప్రత్యేక అప్డేట్లు విడుదలయ్యే అవకాశం ఉండటంతో నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

