Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
Bhogi | టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శర్వానంద్ ఈసారి మాస్ హీరోగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘భోగి’పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాలోని యాక్షన్‌తో పాటు ఇతర అంశాలను పరిచయం చేయగా.. తాజాగా చిత్రబృందం తొలి పాటను విడుదల చేసింది. ‘ఎగిలి వరంగ’ పేరుతో వచ్చిన ఈ జానపద గీతం పల్లె జీవనశైలిని, అక్కడి ప్రజల సంస్కృతిని అందంగా ఆవిష్కరిస్తోంది.
Bhogi | టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శర్వానంద్ ఈసారి మాస్ హీరోగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘భోగి’పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాలోని యాక్షన్‌తో పాటు ఇతర అంశాలను పరిచయం చేయగా.. తాజాగా చిత్రబృందం తొలి పాటను విడుదల చేసింది. ‘ఎగిలి వరంగ’ పేరుతో వచ్చిన ఈ జానపద గీతం పల్లె జీవనశైలిని, అక్కడి ప్రజల సంస్కృతిని అందంగా ఆవిష్కరిస్తోంది. ‘ఎగిలి వరంగ’ పాటలో గ్రామీణ జీవితంలోని ఎన్నో కోణాలను చూపించారు. తెల్లవారుజామున పల్లెల్లో మొదలయ్యే సందడి, తమ తమ పనులకు వెళ్లే ప్రజలు, వారి వృత్తులు, కుటుంబాల మధ్య ఉండే అనుబంధాలు వంటి అంశాలను పాటలో పొందుపరిచారు. గ్రామంలోని పెద్దల పట్ల ప్రజలు చూపించే గౌరవం, పటేల్ పట్ల ఉండే మర్యాదను కూడా ఈ గీతం ప్రతిబింబిస్తోంది.
పల్లె ప్రజలు తమ కష్టాలను లెక్కచేయకుండా రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యే విధానాన్ని పాటలో సహజంగా చూపించారు. అదే సమయంలో గ్రామీణ సమాజంలో కనిపించే భూస్వామ్య పెత్తనం, అణచివేత వంటి అంశాలనూ కొన్ని దృశ్యాల ద్వారా పరిచయం చేశారు. దీంతో ఈ పాట కేవలం వినోదానికే పరిమితం కాకుండా, సినిమా కథలోని సామాజిక నేపథ్యాన్ని కూడా సూచిస్తోంది. ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పల్లె వాతావరణానికి తగిన పదాలతో ఆయన పాటకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం జానపద శైలికి మరింత బలాన్ని ఇచ్చింది. నల్గొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్ బాబు, రిలారే గోపాల్ తమ గాత్రాలతో పాటకు ప్రత్యేకమైన జోష్ తీసుకొచ్చారు.
ఇక శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ పల్లెటూరి పాత్రలకు తగ్గట్టుగా కనిపిస్తున్నారు. వారి వేషధారణ, పాటలోని గ్రామీణ నేపథ్యం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మరో కథానాయికగా డింపుల్ హయాతి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా శర్వానంద్ మాస్ ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని చూస్తున్నారు. టీజర్ తర్వాత విడుదలైన తొలి పాటతో సంగీత ప్రచారాన్ని ప్రారంభించిన చిత్రబృందం, జానపద గీతం ద్వారా సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ‘భోగి’ చిత్రం 2026 నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. యాక్షన్, గ్రామీణ నేపథ్యం, సామాజిక అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

