సంతోష్ రాజ్, ‘బిగ్‌బాస్’ ఫేమ్ భానుశ్రీ జంటగా రూపొందుతున్న చిత్రం ‘క్లిక్’. శ్రీనివాస్ కౌశిక్ దర్శకుడు. బీఎల్ బాబు నిర్మాత. ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ నేటి సమాజంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన యాక్షన్ క్రైమ్ థిల్లర్ చిత్రమిది. భానుశ్రీ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని అందించారని సెన్సారు సభ్యులు అభినందించారు’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సతీష్‌బాబు