Barbie Movie | సరిగ్గా యాభై రోజుల కిందట రిలీజైన ‘బార్బీ’ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. పోటీగా దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ఓపెన్ హైమర్’ ఉన్నా.. బార్బీ దాటికి ఆ సినిమా కలెక్షన్లు కూడా దిబేల్మని పడిపోయాయి. స్టార్ సెలబ్రెటీలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ బార్బీ మత్తులో ఊగిపోయారు. పైగా సినిమా చూడడానికి పింక్ కలర్ కాస్ట్యూమ్ వేసుకుని వెళ్లారంటే ఈ సినిమా చూపిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మార్గొట్ రాబీ బార్బీ రోల్లో నటించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు సైతం కళ్లు చెదిరే స్థాయిలో వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా $1.4 బిలియన్ కలెక్షన్లు సాధించింది. అంటే ఇండియన్ కరెన్సీలు అక్షరాలు రూ.11,000 కోట్లు. ఒక ఫాంటసీ సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్లు రావడం అంటే విషేశం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసిన తొలి మహిళా దర్శకురాలిగా గ్రెటా సంచలన రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా చూడాలంటే సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు అదనంగా రూ.499 చెల్లించాల్సి ఉంటుంది.
ఒక్క సారి రెంట్ తీసుకున్న తర్వాత కేవలం 48గంటల్లోనే ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత. సినిమా చూడాలంటే మళ్లీ కొత్తగా రెంట్ తీసుకోవాల్సిందే. ఇక ఈ పద్దతి కనీసం రెండు, మూడు వారాలైనా కొనసాగే చాన్స్ ఉంది. కాగా అన్ని దేశాల్లో ఓపెన్ హైమర్‌ను కొట్టేసిన బార్బీ.. ఒక్క ఇండియాలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇండియాలో బార్బీ కేవలం రూ.50 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.