TG Vishwa Prasad | రామబాణం టైటిల్‌ను బాలకృష్ణ సూచించారు : నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చిట్ చాట్
TG Vishwa Prasad | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రామబాణం విశేషాలు ఆయన మాటల్లోనే..
TG Vishwa Prasad | టాలీవుడ్లో ఉన్న లీడింగ్ ప్రొడక్షన్స్ హౌజెస్‌లో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రామబాణం విశేషాలు ఆయన మాటల్లోనే..
రామబాణం టైటిల్ ఎలా పెట్టారు..?
మాకు రామబాణం టైటిల్ పెట్టాలని నందమూరి బాలకృష్ణ సూచించారు. మొదట పలు టైటిల్స్‌ను పరిశీలించాం. మా నుంచి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్కు రామబాణం అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని అదే టైటిల్‌కు ఫిక్స్ అయ్యాం.
ఐటీ నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్ వైపు మీ జర్నీ గురించి..?
నేను సాధారణంగా ఐటీ బిజినెస్ మ్యాన్ని. నేనిప్పటికీ నా బిజినెస్ విజయవంతంగా కొనసాగిస్తున్నా. సినిమాలపై ఉన్న మక్కువతోనే నిర్మాణంలోకి అడుగుపెట్టాను. ఎంట్రీ కంటే ముందు రెండేళ్లపాటు ఫిల్మ్ ప్రొడక్షన్స్ నైపుణ్యాలను అధ్యయనం చేశా. ఆర్థికపరమైన కోణంలో చూస్తే సినిమాలు, ఐటీ బిజినెస్‌కు పోలికే ఉండదు. ఎందుకంటే ఐటీ చాలా లాభదాయకమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజయవంతమైన వెంచర్.
రామబాణం మెయిన్ హెలైట్స్ ఏంటీ..?
యాక్షన్, ఎమోషన్స్ తో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీని శ్రీవాస్ రాశాడు. అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్లు, భారీ నిర్మాణ విలువలు, నటీనటులు గోపీచంద్, డింపుల్ హయతి, జగపతిబాబు, ఖుష్బూ సినిమాకు మెయిన్ హైలెట్.
ఫ్యామిలీ ఎంటర్టైనర్లో యాక్షన్ హీరో గోపీచంద్‌ను ఎందుకు సెలెక్ట్ చేశారు..?
రామబాణం ఫ్యామిలీ ఎంటర్టైనర్.. కానీ థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. యాక్షన్ స్టార్ గోపీచంద్ యాక్టింగ్‌ను అభిమానులు బిగ్ స్క్రీన్‌పై చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
సినిమా మేకింగ్‌లో మీరు ఎంతవరకు చొరవతీసుకున్నారు..?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కేవలం సినిమాలను తీయడమే కాదు. సినీ పరిశ్రమకు కావాల్సిన ఎకో సిస్టమ్‌ను నిర్మించే పనిలో ఉన్నాం. ఫిల్మ్ మేకింగ్‌కు కావాల్సిన సదుపాయాలను సృష్టించడంపైనే మా ఫోకస్ ఉంటుంది. సినిమాలను నిర్మించే సమయంలో మా దర్శకులు, టీం మెంబర్స్ వారి విజన్‌ను బెస్ట్‌గా చూపించే స్వేచ్చను ఇస్తాం. వారి సృజనాత్మక విషయాల్లో తలదూర్చడం ఉండదు.
ఓటీటీ వరల్డ్‌లోకి వెళ్లే ఆలోచనలున్నాయా..?
ఈ రోజుల్లో సినిమా బిజినెస్‌లో నాన్ థ్రియాట్రికల్ రెవెన్యూ విషయంలో ఓటీటీ 50 శాతంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏదో ఒక సమయంలో ఎక్జయిటింగ్ కంటెంట్‌తో ఓటీటీకి పనిచేస్తాం. సరైన సమయంలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

